About Us

ఈమాట పాఠకులకు ముందుగా నమస్కారం...!

 

వార్త అంటే కేవలం సమాచారం కాదు, అది ఒక సామాజిక బాధ్యత. నేటి సమాజంలో సమాచార ప్రవాహం పెరిగినప్పటికీ, నిఖార్సైన నిజం కోసం సామాన్యుడు నిరీక్షించాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో, అక్షరానికి ఉన్న శక్తిని అస్త్రంగా మలచి, ప్రజాస్వామ్య మూలస్థంభాలను మరింత పటిష్టం చేసే లక్ష్యంతో ‘ఈమాట’ దినపత్రిక మీ ముందుకు వస్తోంది. 

 

ఎవరికీ తలవంచని నిర్భీతి, ఏ పక్షానికీ లొంగని నిష్పాక్షికత మా కలం బలం. వార్తను వార్తగా మాత్రమే చూపిస్తూ, సత్యాన్ని విశ్లేషించడమే మా ప్రథమ కర్తవ్యం.పాలకులకు, ప్రజలకు మధ్య ఒక వారధిలా ఉంటూ అట్టడుగు వర్గాల ఆవేదనను, సామాన్యుడి ఆశలను ప్రభుత్వ గడప వరకు చేర్చే బాధ్యతను ‘ఈమాట’ భుజానికెత్తుకుంటుంది.

 

కేవలం సంచలనాల కోసం కాకుండా, సమాజానికి దిశానిర్దేశం చేసే విలువల కోసం మా పత్రిక నిరంతరం శ్రమిస్తుంది. రేపటి తరానికి స్ఫూర్తినిచ్చే ఆలోచనలను,అక్షర రూపంలో భద్రపరుస్తుంది. మన భాషా సంస్కృతులను కాపాడుకుంటూనే, మారుతున్న ప్రపంచ పోకడలను తెలుగు పాఠకులకు చేరువ చేయడమే 

 

మా ఆశయం."అబద్ధపు హోరులో అక్షరం వాడిపోకూడదు.అధికారపు అలికిడికి నిజం అణిగిపోకూడదు. ప్రజా పక్షమే పరమావధిగా, పారదర్శకతనే ప్రాణవాయువుగా చేసుకొని వస్తోంది ‘ఈమాట’. ఇది కేవలం ఒక దినపత్రిక కాదు.. ఇది అక్షర సత్యాల గెలుపు బాట..!"